నంద్యాల.. ఏపి లగచర్లగా మారబోతుందా ?
రాయలసీమలో యురేనియం నిక్షేపాల తవ్వకాలపై ఆయా ప్రాంత ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమౌతున్నప్పటికీ అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుంది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మామిళ్ల,రాంపురం,జక్కసాని పల్లి ప్రాంతాల్లో 5 కి.మీ.మేర తవ్వకాలకు అనుమతిస్తూ ఏఎండి టెండర్లను ఆహ్వానిస్తునట్లు ప్రకటించింది. దీంతో మళ్లీ కలకలం మొదలైంది.కప్పట్రాళ్ల వంటి గ్రామస్థులు ఇప్పటికే ఈ విషయంలో ఆందోళన చేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు ఉపక్రమించడం చూస్తుంటే..ఏపిలో నంద్యాల అనేది మరో లగచర్ల కాబోతుందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. మరో వైపు నంద్యాల రెవిన్యూ శాఖాధికారులు ఈవిషయంలో తమకెటువంటి ఉత్తర్వులు రాలేదని స్పష్టం చేస్తున్నారు. రెవిన్యూ శాఖకు కనీస సమాచారం ఇవ్వకుండా తవ్వకాలెలా జరుపుతారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

