InternationalSports

భారత్ ఘోర ఓటమి

చివరకు అనుకున్నదే అయింది. అద్భుతాలేం జరగలేదు. టీమిండియా రెండవ టెస్ట్ మ్యాచ్‌ను కూడా జారవిడుచుకుంది. మరో టెస్ట్ మిగిలి ఉండగానే న్యూజిలాండ్ 2-0 స్కోరుతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. టెస్టు ర్యాంకుల్లో  అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత్ జట్టుకు న్యూజిలాండ్ భారీ షాక్‌ను ఇచ్చింది. మిచెల్ శాంట్నర్ స్పిన్ మాయాజాలంలో భారత్ ఓపెనర్లు విలవిల్లాడారు. 359 పరుగుల భారీ లక్ష్యంతో ఆట మొదలు పెట్టిన భారత్ టీమ్‌లో యశస్వి జైస్వాల్ (77) మాత్రం చెప్పుకోదగ్గ స్కోర్ సాధించాడు. రవీంద్రజడేజా (38) పరుగులతో చెత్త రికార్డు రాకుండా కాపాడాడు. దీనితో 12 ఏళ్ల అనంతరం స్వదేశంలో సిరీస్‌ను కోల్పోయింది టీమిండియా. ఈ ఓటమిపై బీసీసీఐ ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.