భారీ ఎత్తున గంజాయి స్వాధీనం
చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అధిక మొత్తంలో గంజాయిని జగ్గయ్యపేట పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు.నిందితుల నుంచి సుమారు 30 లక్షలు విలువైన 218 కేజీల గంజాయి , రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు.ఈ విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా అనేది లేకుండా చేయడానికి పటిష్టమైన నిఘాతో పలు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం వాహన తనిఖీలు చేస్తున్నామని చెప్పారు.ఇందులో భాగంగా వ్యసనాలకు గురైన కొంత మంది యువకులు…విశాఖ బోర్డర్‌లో గంజాయి సేకరించి హైద్రాబాద్‌కి అధిక మొత్తంలో తరలించి సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు.

