ఆమె మనవడికి కేసీఆర్ పేరు
బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై అభిమానంతో ఆదిలాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్ నేత తన మనవడికి కేసీఆర్ పేరు పెట్టుకున్న విషయం వైరల్ అవుతోంది. ఆదిలాబాద్ జిల్లా ముఖరాకే గ్రామ సర్పంచ్ గాడ్గే మీనాక్షి సుభాష్‌కు ఇటీవల మనవడు పుట్టాడు. తమ గ్రామానికి కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎంతో సేవ చేశారని, ఆయన రుణం తీర్చుకోలేమని, అందుకే ఆయన పేరు తన మనవడికి పెడుతున్నట్లుగా ఆమె ప్రకటించారు. దీనితో బీఆర్‌ఎస్ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2023లో మీనాక్షి ముఖరా గ్రామానికి చేసిన మంచిపనులకు గాను మహిళా దినోత్సవం నాడు స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ కార్యక్రమంలో మహిళా విజేత పురస్కారాన్ని కూడా అందుకోవడం విశేషం. తాగునీరు, మురుగు కాలువలు, ఇంకుడుగుంతలు ఏర్పాటు చేయించి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారు మీనాక్షి. ఇవన్నీ కేసీఆర్ సహకారం వల్లే జరిగాయని ఆమె చెప్పుకొచ్చారు.

