ఏపీలో భారీగా నమోదవుతున్న పోలింగ్
ఏపీలో పోలింగ్ భారీగా నమోదవుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటి వరకు ఏపీలో 24 శాతం పోలింగ్ పూర్తయ్యింది. ఎన్టీఆర్ జిల్లాలో 21.39 శాతం, పల్నాడు జిల్లాలో 23.25 శాతం, కడప జిల్లాలో 27.02 శాతం, ప్రకాశం జిల్లాలో 23.89 శాతం నమోదయ్యింది. కాకినాడలో 21.26 శాతం, కృష్ణా జిల్లాలో 25.84 శాతం, కర్నూలులో 22.05 శాతం, నంద్యాలలో 27.18 శాతం, సత్యసాయి జిల్లాలో 20.61 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 21.37 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఏలూరులో 24.28 శాతం, బాపట్లలో 26.88 శాతం, చిత్తూరులో 25.81 శాతం, కోనసమీలో 26.74 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 21.37 శాతం, తిరుపతిలో 22.66 శాతం, విశాఖలో 20.47 శాతం, విజయనగరంలో 23.21 శాతం పోలింగ్ జరిగింది. గుంటూరులో 20.84 శాతం పోలింగ్ జరిగింది. మొత్తంగా ఏపీలో ఇప్పటి వరకు పోలింగ్ సజావుగా సాగుతోంది. ఏపీలో భారీగా పోలింగ్ నమోదవడంపై ఓటురు తీర్పుపై పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది.

