ప్రజలందరికీ త్వరలో హెల్త్ ప్రొఫైల్ కార్డులు!
టిజి: ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా.. రాష్ట్రంలోని ప్రజలందరికీ సమగ్ర సమాచారం (హెల్త్ ప్రొఫైల్) సేకరించందుకు వైద్యారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని చేరువ చేయడంతో పాటు సత్వర, సమగ్ర చికిత్సలే లక్ష్యంగా దీన్ని రూపొందించనున్నారు. ప్రతి ఒక్కరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించి, ఆరోగ్య కార్డులను అందిస్తారు. ఈ మేరకు అవసరమైన కార్యాచరణను వైద్యారోగ్యశాఖ ప్రారంభించింది.

