వాహనదారులకు శుభవార్త..
హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నగరంలో 31 ఫ్లై ఓవర్లు నిర్మించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించారు. 17 అండర్ పాస్ లు కూడా నిర్మిస్తామన్నారు. వీటితోపాటు పది చోట్ల రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. నగర సుందరీకరణ కోసం 150 కోట్లను కేటాయిస్తున్నట్టు చెప్పారు.

