మాజీ మంత్రి అనుచరుడు అరెస్ట్..
మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు వంకరెడ్డి మాధవరెడ్డిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో ఆయనను అరెస్టు చేశారు. మాధవరెడ్డే ఈ కుట్రలో ప్రధాన సూత్రధారిగా సీఐడీ అభియోగాలు మోపింది. నెలరోజులుగా పరారీలో ఉన్న మాధవరెడ్డిని ఎట్టకేలకు చిత్తూరు జిల్లా పెద్దగొట్టిగల్లు వద్ద తన ఫాంహౌస్‌లో ఉండగా పట్టుకున్నారు. ఈ కేసులో మాధవరెడ్డితో పాటు పెద్దిరెడ్డి పీఏ ముని తుకారాం కూడా కుట్రదారులని పేర్కొంది సీఐడీ. అయితే తుకారాం ఈ ఘటన జరిగిన వెంటనే విదేశాలకు పారిపోయారు.

