Home Page SliderNational

కదులుతున్న రైలులో మంటలు..

హర్యానాలోని రోహతక్ రైలులో మంటలు చెలరేగాయి. కదులుతున్న రైలులో బాణసంచాకు నిప్పంటుకోవడంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. జింద్ నుంచి ఢిల్లీ వెళుతున్న రైలులో తొలుత మంటలు లేచాయని, తర్వాత రైలు మొత్తం పొగతో నిండిపోయిందని జీఆర్పీ పోలీసులు తెలిపారు. రైలులో షార్ట్స్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న బాణ సంచాకు అంటుకోవడంతో అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తేల్చారు. పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.