ఎలక్షన్స్: డిపాజిట్లు కోల్పోవడం అంటే?
ఎన్నికల్లో మీకు డిపాజిట్లు కూడా రావు అంటూ పొలిటీషియన్లు తమ ప్రత్యర్థులనుద్దేశించి వ్యాఖ్యనాలు చేస్తుంటారు. డిపాజిట్లు కోల్పోవడం అంటే నామినేషన్ సమయంలో డిపాజిట్ చేసిన డబ్బుని ఆ అభ్యర్థికి తిరిగి చెల్లించకపోవడం. నియోజకవర్గాల్లో నమోదైన ఓట్లలో ఆరో వంతు ఓట్లు (16 శాతం ప్లస్) వస్తేనే ఫలితాల అనంతరం రిటర్నింగ్ అధికారి డిపాజిట్‌ను ఆయా అభ్యర్థులకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. లేదంటే అవి కోల్పోయినట్లే. ఆ నగదును ఈసీ స్వాధీనంలోనే ఉంటుంది.

