Andhra PradeshHome Page Slider

చంద్రబాబుకు ఏమైనా జరిగితే సీఎందే బాధ్యత :నారా లోకేష్

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యి దాదాపు నెల రోజుల పైనే అవుతుంది. అయితే ఇప్పటికీ ఆయనకు బెయిల్ లభించలేదు. దీంతో చంద్రబాబు నాయుడు నెల రోజుల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నిన్న అస్వస్థతకు గురయ్యారు. చంద్రబాబును పరిశీలించిన వైద్యులు ఆయన డీహైడ్రేషన్‌కు గురైనట్లు తెలిపారు. అంతేకాకుండా చంద్రబాబు స్కిన్ అలర్టీతో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. అయితే చంద్రబాబు అనారోగ్యానికి గురవడంతో ఆయన కుటుంబ సభ్యులు భువనేశ్వరి,నారా లోకేష్ ,బ్రహ్మిణి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా దీనిపై నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని..ఉద్దేశపూర్వకంగానే ఆయన ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నారని లోకేష్ ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. చంద్రబాబుకు జైలులో అపరిశుభ్రమైన నీరు,బరువు తగ్గడం,ఇన్ఫెక్షన్లు,ఎలర్జీలతో సతమవుతున్నారని లోకేష్ పేర్కొన్నారు. చంద్రబాబు విషయంలో ప్రభుత్వ అధికారులు,డాక్టర్లు ఏం దాచాలని చూస్తున్నారని లోకేష్ ప్రశ్నించారు. కాగా జైలులో చంద్రబాబుకు ఏమైనా జరిగితే సీఎం జగనే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని నారా లోకేష్ హెచ్చరించారు.