మంత్రి పర్యటనలో ఇరుపార్టీ నేతల ఘర్షణ
మంత్రి శ్రీధర్ బాబు పర్యటన సందర్భంగా స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. స్థానిక కార్పొరేటర్‌కు అండగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేస్తుండగా.. స్థానిక ఎమ్మెల్యేకు అనుకూలంగా బీఆర్ఎస్ కార్యకర్తల కూడా నినాదాలు చేశారు. పోలీసు బందోబస్తు నడుమ మంత్రి శ్రీధర్ బాబు, మేయర్ పర్యటన కొనసాగింది. ఇదంతా హైదరాబాద్ లోని రామంతాపూర్ లో జరిగింది. ఈ రోజు రామంతాపూర్ డివిజన్ లో రూ.43.27 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేసే సమయంలో ఈ ఘర్షణ జరిగింది.

