Home Page SliderNational

బీజేపీ ఎంపీ కన్నుమూత

బీజేపీ లోక్‌సభ ఎంపీ గిరీశ్ బాపట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆయన ఏడాదిన్నరగా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన బాపట్ కస్బాపేట్ నియోజక వర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019లో పుణె నుండి లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖామంత్రిగా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కూడా పని చేశారు.

ఈయన మరణం పట్లు ప్రధాని మోదీ సంతాపం తెలియజేస్తూ ఆయన కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం ఉన్నవాడని, ఆడంబరాలు లేనివాడని, పార్టీకి ఎంతో అండదండగా ఉండేవారని కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు, మద్దతుదారులకు  సానుభూతిని తెలియజేశారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా ఆయన మరణవార్త చాలా బాధ కలిగించిందంటూ ట్వీట్ చేశారు. ఆయనకు రాజకీయాలలో ఎంతో అనుభవం ఉందని, ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా చాలా చక్కగా పనులు చక్కదిద్దేవారని, అలాంటి ప్రజాభిమానం కల నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.