Home Page SliderTelangana

బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల

ఎట్టకేలకు బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, రాజ్య సభ సభ్యుడు లక్ష్మణ మినహా అగ్రనేతలు రేసులో నిలిచారు. బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ హుజూరాబాద్ తో పాటుగా గజ్వేల్ నుంచి సైతం బరిలో దిగుతున్నారు. సీఎం కేసిఆర్ ను ఓడిస్తా అంటూ ఈతల గత కొద్ది రోజులుగా చెబుతున్నారు. బండి సంజయ్ కరీంనగర్ నుంచి, ధర్మపురి అరవింద్ కోరుట్ల నుంచి, గోషామహల్ నుంచి రాజా సింగ్ పోటీ చేస్తున్నారు.