మునుగోడులో టీఆర్ఎస్‌కు భారీ షాక్
మునుగోడు ఉప ఎన్నికల గుర్తుల వివాదంలో టీఆర్ఎస్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఉప ఎన్నికలో కారును పోలిన గుర్తులను తొలగించాలంటూ టీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇవాళ ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈసీ వాదనతో ఏకీభవించిన కోర్టు..కారును పోలిన గుర్తులను తొలగించాలని ఈసీని ఆదేశించలేమని తెలిపింది. మునుగోడు ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఇప్పటికే గుర్తులు కేటాయించామని హైకోర్టుకి నివేదించింది ఎన్నికల సంఘం. దీంతో ఈ సమయంలో ఈ పిటిషన్‌పై జోక్యం చేసుకోలేమన్న ఉన్నత న్యాయస్థానం టీఆర్ఎస్‌ను వేసిన పిటిషన్‌ను కొట్టేసింది

