Home Page SliderNational

టీమిండియా బౌలర్ షమీకి అర్జున అవార్డ్

టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ ఇటీవల జరిగిన వరల్డ్ కప్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రత్యర్థులను మట్టి కరింపించిన విషయం తెలిసిందే. అయితే షమీ ఇప్పటివరకు జరిగిన టీ20,టెస్ట్ మ్యాచ్,వన్డే మ్యాచుల్లో అదరగొట్టారు. దీంతో కేంద్రం అతడికి తాజాగా అర్జున అవార్డ్‌ను ప్రకటించింది. కాగా అతనితో పాటు క్రీడల్లో ప్రతిభ చూపిన మరో 26 మందికి అర్జున అవార్డులకు ఎంపికైనట్లు తెలిపింది. అయితే ఈ జాబితాలో ఏపీకి చెందిన అంధుల క్రికెట్ కెప్టెన్ ఇల్లూరి అజయ్ కుమార్ కూడా ఉన్నారు. ఈ మేరకు కబడ్డీలో పవన్ కుమార్,రెజ్లింగ్‌లో సునీల్ కుమార్,చెస్ విభాగంలో వైశాలి అర్జున అవార్డ్‌కు ఎంపికయ్యారు. అయితే త్వరలోనే వీరంతా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డ్‌ను అందుకోనున్నారు.