లగ్జరీ ఫ్లాట్ అమ్మిన అమితాబ్.. ధర ఎంతంటే..?
బాలీవుడ్ లెజెండరీ అమితాబ్ బచ్చన్ ఇటీవల ముంబైలోని ఓషివారాలోని తన విలాసవంతమైన డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను ₹83 కోట్లకు విక్రయించారు. 5 వేల చదరపు విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్మెంట్ దాదాపు ఆరు కార్లు పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉంది. ఈ లగ్జరీ ఫ్లాట్ను విజయ్ సింగ్ వాకర్, కమల్ విజయ్ ఠాకూర్ రూ.83 కోట్లకు కొనుగోలు చేశారు. బిగ్ బీ ఈ ఇంటిని ఏప్రిల్ 2021లో రూ.31కోట్లకు కొనుగోలు చేశారు. బచ్చన్ ఈ ఇల్లు కోనుగోలు చేసినప్పటికీ ఇప్పటికీ 168 శాతం వాల్యూ పరిగిందని చెబుతున్నారు. క్రిస్టల్ గ్రూప్ ద్వారా ది అట్లాంటిస్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లో ఉన్న ఈ ఆస్తి 5,704 చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియా మరియు 5,185 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాలో విస్తరించి ఉంది. డ్యూప్లెక్స్ 4,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన టెర్రస్‌ను కలిగి ఉంది మరియు ఆరు మెకనైజ్డ్ కార్ పార్కింగ్ స్థలాలతో వస్తుంది. నవంబర్ 2021లో బచ్చన్ ఈ ఇంటిని హీరోయిన్ కృతి సనన్ కు నెలకు 10 లక్షల రెంట్ సెక్యూరిటీ డిపాజిట్ రూ.60 లక్షలతో అద్దెకు ఇచ్చారు. నటనతో పాటు నాలుగేండ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నారు.

