Home Page SliderTelangana

సీఎం ఫారెన్ టూర్ కు ఏసీబీ కోర్టు పర్మిషన్..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 13 నుంచి 23వ తేదీ వరకు బ్రిస్బేన్, దావోస్ పర్య టనకు సీఎం వెళ్లనున్నారు. జూలై 6వ తేదీ లోపు తిరిగి పాస్ పోర్టును అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఓటుకు నోటు కేసులో బెయిల్ కోసం రేవంత్ రెడ్డి తన పాస్ పోర్టును కోర్టుకు అప్పగించారు. విదేశాలకు వెళ్లే ప్రతిసారి కోర్టు నుంచి తన పాస్ పోర్టును తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రాబోయే విదేశీ పర్యటనల నేపథ్యంలో పాస్ పోర్టు కోసం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉందని, ఆరు నెలల పాటు పాస్ పోర్టు ఇవ్వాలని సీఎం అభ్యర్థించారు. సీఎం అభ్యర్జనను పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు.. ఇవాళ పాస్ పోర్టు ఇచ్చేందుకు అంగీకరించింది.