Home Page SliderNational

రాహుల్ గాంధీ జీవితంపై పుస్తకం రాసిన ప్రముఖ జర్నలిస్ట్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. కాగా ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఎంతోమంది ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుకున్నారు. దీంతో ఎంతోమంది ఆయనకు అభిమానులయ్యారు . ఈ అభిమానంతోనే  ప్రముఖ జర్నలిస్ట్ శ్రీనివాస రాజు రాహుల్ గాంధీ రాజకీయ జీవితంపై పుస్తకం రాశారు. ఈ బుక్‌లో రాహుల్ గాంధీ ఐడియాలు, లీడర్‌షిప్‌పై ముఖ్యంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కాగా ఆయన ఈ బుక్‌కు “స్ట్రేంజ్ బర్డెన్స్ ది పాలిటిక్స్ అండ్ ప్రిడికామెంట్స్ ఆఫ్ రాహుల్ గాంధీ” అని నామకరణం చేశారు. అయితే ఈ బుక్‌ను వచ్చే నెల 28న విడుదల చేయనున్నట్లు పబ్లిషింగ్ హౌస్ “పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా” ప్రకటించింది. కాగా ఈ బుక్‌లో రాహుల్ గాంధీ రాజకీయ ప్రస్థానం 2004 నుంచి మొదలై మొన్నటివరకు జరిగిన భారత జోడో యాత్ర వరకు ఎలా కొనసాగిందో ప్రస్తావించినట్లు సమాచారం.