ఏపిలో దూకుడు పెంచిన వైఎస్సార్‌సీపి
కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల తర్వాత వైసీపి దూకుడు పెంచింది. అందరిలో నూతనోత్తేజం నింపేందుకు సంస్థాగత పదవుల నియామకం పేరుతో లీడర్‌ని క్యాడర్ ని ఏకం చేసేందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కొత్త వ్యూహాలకు పదును పెట్టారు.ఇందులో భాగంగా తాజా మాజీలంతా మళ్లీ పార్టీ పదవులు ప్రమాణ స్వీకారమహోత్సవాల్లో తళుకులీనుతున్నారు. ఇన్నాళ్లు కలుగులో ఉన్న మాజీ మంత్రులు ఇప్పుడిప్పుడే జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు.ఇక అంబటి రాంబాబు ఒక అడుగు ముందుకేసి మీ రెడ్ బుక్ ని చూసి మా ఇంటి కుక్క కూడా భయపడదని నారా లోకేష్‌ని ఉద్దేశ్యించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. గడచిన ఆరు నెలల వ్యవధిలో ఎన్నో దాడులు,అత్యాచార ఘటనలతో అట్టుడికిన ఏపిలో రానున్న రెండేళ్లలోనే రాజన్న రాజ్యం స్థాపిస్థామని అంబటి స్పష్టం చేశారు.అంతేకాదు రెండేళ్లలోనే దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మాజీ ఎంపి విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.మొత్తం మీద కలుగులో ఉన్న నాయకుంలంతా మళ్లీ పబ్లిక్ లోకి రావడంతో వైసీపి లో మాంచి జోష్ ఏర్పడింది.

