కోలాహలంగా వైఎస్సార్సీపీ ప్రతినిధుల సభ
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ జరగుతున్న వైఎస్సార్సీపీ ప్రతినిధుల సభకు అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు కదిలి వచ్చారు. దీంతో కార్యక్రమం జరిగే విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కోలాహలంగా మారింది. పలువురు నాయకులు మా నమ్మకం నువ్వే జగన్, వై నాట్ 175 ఫ్లకార్డులు ప్రదర్శించారు.

ఎన్నికల సమరానికి సమాయత్తమవుతున్న వైఎస్ఆర్సీపీ
ఏపీలో ఎన్నికల సమరానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం సమాయత్తమతోంది. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పార్టీ శ్రేణులను ఎన్నికలే లక్ష్యంగా సమాయత్తపరచునున్నారు. సోమవారం పార్టీ వ్యవస్థలో అత్యంత కీలకమైన మండలస్థాయి నాయకులతో నేరుగా సీఎం జగన్ సమావేశం అవుతున్నారు. విజయవాడలో జరిగే ఈ ప్రతినిధులు సభను ఉద్దేశించి సీఎం కీలక ముఖ్యమైన ప్రసంగం చేయనున్నారు. ఎన్నికల వేళ పార్టీకి దిశ, దశను ఆయన ఖరారు చేయనున్నారు. ఇంతంటి ప్రతిష్టాత్మక సమావేశానికి సోమవారం ఉదయం 9 గంటలకు ఇందిరా గాంధీ స్టేడియంలో రాష్ట్ర స్థాయి నుండి మండల స్థాయి వరకు 13 ఉమ్మడి జిల్లాల నుండి 8000 మందికి పైగా నాయకులు, సమావేశంలో పాల్గొననున్నారు. ప్రత్యేకించి వైఎస్ఆర్సిపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పార్టీ నేతలతో సీఎం జగన్ సభను నిర్వహించబోతుండటం రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటివరకు సీఎం జగన్ అధికారిక సమావేశాలు సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. నెలలో మూడు కార్యక్రమాలకు పైగా పాల్గొంటూ వస్తున్నప్పటికీ అవన్నీ ప్రభుత్వపరమైన సభలు సమావేశాలే. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో దసరా తర్వాత సీఎం జగన్ నిత్యం ప్రజల్లో ఉండాలని వారంలో మూడు రోజులు గ్రామాల్లోనే పర్యటించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీపరమైన సమావేశాన్ని నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపటంతో పాటు క్షేత్రస్థాయి నుంచే మరింత పటిష్టం చేసే పనులను సిద్ధం చేయాలని ఆయన యోచిస్తున్నారు. అందులో భాగంగానే విజయవాడ వేదికగా భారీ సభను నిర్వహించి మండల స్థాయి నాయకులతో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదిశగానే పార్టీ పదవులతో పాటు వివిధ విభాగాల్లో పార్టీకి సేవలు అందిస్తున్న సుమారు 25 కేటగిరీలకు చెందిన ప్రజాప్రతినిధులందరికీ ఆహ్వానాన్ని పంపారు. ఆయా నియోజకవర్గ పరిధిలోని మండలాల నుంచి ఆహ్వానం అందిన ప్రతి ఒక్కరు సభకు వచ్చేలా ఎమ్మెల్యేలు పక్కా ఏర్పాట్లు చేపట్టారు.