వైసీపీ మంత్రిని జైలుకు పంపిస్తాం:పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న పెడనలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఆయన వైసీపీ నాయకులపై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా నిన్నపెడనలో జరిగిన బహిరంగ సభలో పవన్ వైసీపీ మంత్రి జోగి రమేష్‌ను హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ..మీ దురాగతాలను మేము మర్చిపోలేదు. భవిష్యత్తులో వీటన్నింటికి మీరు చట్టపరమైన సమాధానం చెప్పాలి అన్నారు. మంత్రి జోగి రమేష్ జనసైనికులను కట్టేసి కొట్టారని తెలిసింది. ఈ విషయంపై ఆయన విచారణకు సిద్ధం కావాలి. ఈ కేసులో ఆయనను ఏ జైలుకు పంపాలో నిర్ణయిద్దామని పవన్ కళ్యాణ్ తెలిపారు.అయితే వైసీపీ మంత్రి జోగి రమేష్‌ను రాజమండ్రి కంటే బెటర్ జైలుకు పంపుదామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఏపీలో టీడీపీ-జనసేన కలిసి వైసీపీని తరిమి కొట్టాలని పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చారు.