Home Page SliderTelangana

రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో భారీగా పెరిగిన యువ ఓటర్లు

Share with

తెలంగాణ ఎన్నికల వేళ యువ ఓటర్ల నమోదు భారీ స్థాయిలో పెరిగింది. దీనిలో ఎలక్షన్ జోరు పెరిగింది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలలో అత్యధికంగా 40 శాతం కొత్తఓట్లు యువ ఓటర్లవే. రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లతో శేరిలింగంపల్లి రికార్డు సృష్టించింది. తరువాతి స్థానంలో రాజేంద్రనగర్  నిలిచింది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో అత్యధిక ఓటర్లు ఉండడానికి ప్రధాన కారణం ఐటీ కారిడార్, గేటెడ్ కమ్యూనిటీలుగా భావిస్తున్నారు. శేరిలింగంపల్లిలోని మియాపూర్, లింగంపల్లి, నల్లగండ్ల ప్రాంతాలలో గేటెడ్ కమ్యూనిటీలు విపరీతంగా పెరిగాయి. రాజేంద్రనగర్ వద్ద బుద్వేల్, అత్తాపూర్ ప్రాంతాలలో కూడా ఒక్కో గేటెడ్ కమ్యూనిటీలో రెండువేల నుండి ఐదువేల మంది వరకూ ఓటర్లున్నారు. మాదాపూర్, గచ్చిబౌలి, నానక్ రామ్ గూడా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, కోకాపేట, నార్సింగి వంటి ప్రాంతాలలో ఐటీ సంస్థలు పెరగడంతో కాలనీలు విస్తరించాయి. ఈ నెలాకరు లేపు కొత్త ఓటర్లకు ఓటర్ కార్డులు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్లు తమ గుర్తింపు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలుగా వారి ఫోన్ నంబర్లకు మెసేజ్‌లు పంపుతున్నారు.