Home Page SliderTelangana

సీఎం రేవంత్‌రెడ్డిని దేవుడిగా కొలుస్తూ మహిళ పూజలు

Share with

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దేవుడిగా కొలుస్తూ ఓ మహిళ పూజలు చేయడం విశేషం. ఆ మహిళ ఎవరో కాదు.. హైదరాబాద్‌‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఫుట్ పాత్‌పై ఫుడ్ స్టాల్ పెట్టుకుని సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన కుమారీ ఆంటీ. అయితే ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై ఉన్న ఆమె షాపును తీసివేయించగా సీఎం రేవంత్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో తిరిగి అక్కడే షాపు పెట్టుకోవడంతో రేవంత్ కు అభిమానిగా మారిపోయారు కుమారీ ఆంటీ. ఈ నేపథ్యంలో ఇంట్లోని దేవుడి గుడిలో రేవంత్ రెడ్డి ఫొటోకు బొట్టు పెట్టి, హారతినిస్తున్న వీడియో నెట్టింట వైరలవుతోంది.