మహిళకు పిల్లుల పిచ్చి..ఫ్లాట్స్‌లో పంచాయితీ
మహారాష్ట్రలోని పూణెలో ఒక మహిళకు పిల్లులంటే పిచ్చిప్రేమ. తన మూడు బెడ్రూముల ఇంటిలో ఏకంగా 350 పిల్లులను పెంచుతోంది దీనివల్ల ఆమెకు ఇష్టంగా ఉన్నా, చుట్టుపక్కల ఇళ్ళవారికి చాలా అసౌకర్యంగా, ఇబ్బందిగా ఉంది. పుణెలోని హడప్సర్ అనే ప్రాంతంలో నాలుగవ అంతస్తులో ఉన్న మహిళ వీటిని పెంచుకోవడంతో పరిసర ప్రాంతాలలో దుర్వాసనగా మారింది. పిల్లులు అరుస్తూ ఇతర ఫ్లాట్స్ వారికి తీవ్ర చిరాకు తెప్పిస్తున్నాయి. అపార్ట్‌మెంట్‌లో పిల్లలు కూడా భయపడుతున్నారు. సొసైటీ వారు ఆమెతో ఎంతగా చెప్పినా వినిపించుకోకపోవడంతో అందరూ కలిసి, పోలీసులకు, మున్సిపల్ కార్పొరేషన్‌కు ఫిర్యాదు చేశారు. వారు ఇంటికి వచ్చి, తనిఖీ చేసి రెండు రోజులలోపు వారు పిల్లులను తరలించకపోతే తామే ఫ్లాట్ ఖాళీ చేయిస్తామని, నోటీస్ ఇచ్చి హెచ్చరించారు.