NewsTelangana

బీఏసీ సమావేశానికి ఎందుకు పిలవట్లేదు

బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలున్నప్పుడు బీఏసీ సమావేశానికి స్పీకర్‌ ఎందుకు పిలవలేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ప్రశ్నించారు. రాజాసింగ్‌ ఒక్కరున్నప్పుడు బీఏసీ సమావేశానికి పిలిచారని, ఎంత మంది ఎమ్మెల్యేలు ఉంటే బీఏసీ సమావేశానికి పిలుస్తారో చెప్పాలన్నారు. ఈ అసెంబ్లీ పదవీ కాలంలోపే అంతమందిని తెచ్చుకుంటామని తెలిపారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీలు కలిసి మూడు రోజుల్లో సభను ముగించాలనుకుంటున్నారని రఘునందన్‌రావు అన్నారు.