Home Page SliderTelangana

తెలంగాణాలో 10 వ తరగతి సప్లీమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

తెలంగాణాలో నిన్న ఇంటర్ ఫలితాలు,ఇవాళ 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో 10 వ తరగతిలో ఫెయిల్ అయినవారికి  జూన్ 14 నుంచి జూన్ 22 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణా విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రా రెడ్డి  వెల్లడించారు. దీనికోసం విద్యార్థులు మే 26 వరకు ఫీజు చెల్లించాలని ఆమె విద్యార్థులకు సూచించారు. అంతేకాకుండా తెలంగాణాలో ఫలితాలు విడుదలైనప్పటి నుంచి జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు తమని ఎంతగానో కలిచివేస్తున్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోకుండా సప్లీమెంటరీ పరీక్షలు వెంటనే నిర్వహిస్తున్నామన్నారు. కాబట్టి తాము వెనకబడతామనే భయం ,ఆందోళన వద్దని ఆమె సూచించారు. మరోవైపు తల్లిదండ్రులు కూడా ఫెయిలైన పిల్లలకు కాస్త మనోధైర్యం ఇచ్చి అండగా నిలవాలని విద్యాశాఖమంత్రి సబతా ఇంద్రా రెడ్డి పిలుపునిచ్చారు.