Home Page SliderInternational

ట్రంప్‌ అధ్యక్షుడు కావడానికి, అబార్షన్స్‌కి లింకేంటి ?

Share with

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత అబార్షన్ మందులకు గిరాకీ పెరిగిందని మీమ్స్, వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ట్రంప్ అధికారంలోకి వస్తే అబార్షన్స్ హక్కును నిషేధిస్తారని రూమర్స్ రావడంతో ఈ మందుల కోసం భారీగా డిమాండ్ పెరిగిందని తెలిపారు. కేవలం 24 గంటలలోనే ఈ మందుల కోసం 10 వేలకు పైగా అభ్యర్థనలు వచ్చాయిట. ఇంకా గర్భిణులు కానివారు కూడా ఈ మందుల కోసం అడుగుతున్నారని సోషల్ మీడియాలలో ఫార్మసీ, మెడికల్ రంగాలు తెలియజేస్తున్నాయి. ఇలాంటి మాత్రలు భారీగా నిల్వ చేసుకుంటున్నట్లు నేషనల్ అబార్షన్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిటనీ పేర్కొన్నారు.