Andhra PradeshHome Page Slider

ఆధారాలు లేకుండా అరెస్టేమిటి?

Share with

చింతపల్లి: చంద్రబాబును ఆధారాలు లేకుండా అక్రమంగా అరెస్టు చేసి వైకాపా ప్రభుత్వం ఘోర తప్పిదం చేసిందని తెదేపా మండల బీసీ సెల్ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు, యూనిట్ ఇన్‌ఛార్జి వంతల కేసుబాబు అన్నారు. బుధవారం అన్నవరం పంచాయతీ కేంద్రంలో బాబుతో నేను కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వంపై రోజురోజుకూ ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల మద్దతు తెదేపాకే ఉంటుందని పేర్కొన్నారు. రాజకీయ కక్షతోనే ప్రభుత్వం చంద్రబాబుపై అక్రమ కేసులు పలు సెక్షన్లతో పెడుతోందని ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తెదేపా నాయకులు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొస్తామన్నారు. నేతలు కిల్లో రామరాజు, వంతల కొండబాబు, వెలుసూరి సోమయ్య, రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.