Home Page SliderNational

క్యాబ్ ఆలస్యమైందని మహిళ ఏం చేసిందంటే..?

Share with

క్యాబ్ కేవలం ఏడు నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు డ్రైవర్ ను ఓ మహిళ కస్టమర్ దుర్భాషలాడుతూ అవమానించిందే కాకుండా అతనిపై ఉమ్మి వేసింది కూడా. అయితే.. డ్రైవర్ మాత్రం ఆమె అంతగా దుర్భాషాలాడిన ప్రశాంతంగా ఉండి, కూల్ గా సమాధానం చెప్పాడు. ఒకవేళ అసౌకర్యంగా ఉంటే క్యాబ్ కంపెనీకి ఫిర్యాదు చేసుకోవాలని, వేరే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోవచ్చని కూడా మర్యాదగా ఆమెను సూచించాడు. డ్రైవర్ ప్రశాంతంగా ఆమె చిందులు వేస్తున్న వీడియో కూడా తీశాడు. వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అతను ఈ సంఘటనను రికార్డ్ చేయడంతో మహిళ వీరంగం బయట పడింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. “ఆమెను అన్ని క్యాబ్ కంపెనీలు తమ సర్వీసులను వినియోగించుకోకుండా నిషేధించాలి. ఇలాంటి కస్టమర్ల నుంచి తమ డ్రైవర్లను కాపాడుకోవడం క్యాబ్ కంపెనీల బాధ్యత కూడా” అని ఒకరు… “ఆలస్యం అవుతుందని తెలిసినప్పుడు క్యాన్సిల్ చేసుకుని వేరే క్యాబ్ బుక్ చేసుకోవాలి. అందులోనూ క్యాబ్ లోకి ఎక్కిన తర్వాత ఈ రాద్ధాంతం ఏంటి? అసలు డ్రైవర్ ను అవమానించడానికి ఆమె ఎవరు? ఇది చాలా బాధాకరమైన సంఘటన” అని కామెంట్లు చేస్తున్నారు.