Andhra PradeshHome Page Slider

“పర్మినెంట్ చేయకపోతే వాలంటీర్లు ప్రభుత్వంపై తిరగబడాలి”… ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి

“పర్మినెంట్ చేయకపోతే వాలంటీర్లు ప్రభుత్వంపై తిరగబడాలంటూ” ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వాలంటీర్లకు పిలుపునిచ్చారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వాలంటీర్లపై అమితమైన ప్రేమను ఒలకబోస్తున్న వైసీపీ పెద్దలకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం..  వారిపై అంత ప్రేమ ఉంటే.. నిజాయితీ ఉంటే తక్షణం ఆ వ్యవస్థను.. వాలంటీర్లను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నానంటూ మండిపడ్డారు. నెహ్రు యువకేంద్రం పై ఇష్టానుసారంగా మాజీ మంత్రి పేర్ని నానికి తనకు తెలిసిందే లోకం అనుకునే వ్యక్తి అని అనుమానం వస్తుందన్నారు.  నెహ్రూ యువజనకేంద్రం 40 సంవత్సరాలుగా నడుస్తోంది.  అది దేశంలో యువత కోసం పనిచేస్తుంది మీరు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ మాదిరిగా కాదనే సంగతి గుర్తుంచుకోవాలి. నెహ్రూ యువ కేంద్రాన్ని  ప్రారంభించింది మీ తల్లి కాంగ్రెస్… వైకాపా పిల్ల కాంగ్రెస్ నేతలు చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడితే పరువు పోతుందని గుర్తుంచుకోవాలన్నారు. రాజధాని అమరావతి లో పేదలకు 50 వేల ఇళ్ళు ఇవ్వాలని కొత్త తరహా మోసానికి తెరలేపారన్నది నిజం. ఓట్లు కోసం నేడు అమరావతి లో  ఇల్లు డ్రామాలు ఆడుతున్నారు. ముఖ్యమంత్రికి అమరావతిలో ఉండాలంటే 30 వేల ఎకరాలు అమరావతికి భూములిచ్చిన రైతుల హక్కులను నెరవేర్చి మాత్రమే అక్కడ పేదలకు ఇళ్ళు కట్టాలని మండిపడ్డారు.

ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలు పురంధరేశ్వరి నేతృత్వంలో నిర్వహిస్తున్న జోనల్ సమావేశాలకు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ప్రొద్దుటూరులో జరిగిన రాయలసీమ జోన్ సమావేశం విజయవంతం అయింది. రాయలసీమ డిక్లరేషన్ విషయంలో బీజేపీ విధానం స్పష్టంగా ఉంది. మంగళవారం కోస్తా జోన్ సమావేశంలో పురంధరేశ్వరి పాల్గొంటారు. కోస్తా జోన్ నుంచి పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు ఈ సమావశంలో పాల్గొంటారు. ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలి.. ప్రభుత్వంపై ఎలా పోరాడాలన్నది ఖరారు చేసుకుంటాం.