మళ్లీ మణిపూర్ లో చెలరేగిన హింస.. 10 మంది హతం
మణిపూర్ లో మరోసారి హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఈ ఘటనలతో సోమవారం నుంచి పలువురు మహిళలు, చిన్నారులు కనిపించకుండాపోయారు. వారిని గుర్తించేందుకు భద్రతా సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. మణిపూర్ లో భద్రతా బలగాలతో జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో 10 మంది కుకీ మిలిటెంట్లు హతమయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లకూ గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. జిరిబామ్ జిల్లాలో సైనికుల్లా దుస్తులు ధరించిన మిలిటెంట్లు అధునాతన ఆయుధాలతో బోరోబెక్రా పోలీస్ స్టేషన్ పై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దాని సమీపంలో ఉన్న సీఆర్పీఎఫ్ క్యాంపుపైనా దాడులు చేశారు. అనంతరం పక్కనే ఉన్న జకురాడోర్ కరోంగ్ గ్రామం వైపు దూసుకెళ్లి, అనేక దుకాణాలకు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో భద్రతా దళాలు – మిలిటెంట్ల మధ్య భారీ స్థాయిలో కాల్పులు చోటు చేసుకున్నాయి.