వికాస్, విశ్వాస్ బుందేల్‌ఖండ్ E-way ఆవిష్కరణ
ఈ రోజు జలౌన్‌లో వికాస్ మరియు విశ్వాస్ బుందేల్‌ఖండ్ E-way ను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ పర్యటన నిమిత్తం శనివారం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరియు ఇతర ప్రముఖులు విమానాశ్రయం వద్ద స్వాగతం పలికారు. బుందేల్‌ఖండ్ ఈ-వే ను దాదాపు రూ. 14,850 కోట్ల వ్యయంతో 296 కి.మీ పొడవున నిర్మించారు. ముందు నాలుగు లేన్ల ఎక్స్‌ప్రెస్ వేగా నిర్మించగా దీనిని మరో రెండు లేన్ల వరకు పొడిగించారు. 2020 ఫిబ్రవరి 29న ప్రధాని మోదీ దీనికి శంకుస్ధాపన చేశారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే కనెక్టివిటీ, పారిశ్రామిక అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ తెలిపారు. కరోన ప్రభావం ఏ మాత్రం లేకుండా దీనిని 28 నెలల్లోనే పూర్తిచేయడం ఆశ్చర్యకరమన్నారు. ప్రభుత్వం మౌలిక సదుపాయాలపైనా, కనెక్టివిటీపై ఎక్కవ దృష్టి పెట్టిందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. గత ఏడేళ్లలో దేశంలో జాతీయ రహదారుల పొడవు 50 శాతం పెరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఈ ఇ-వే బుందేల్‌ఖండ్ ప్రజలకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌కు బహుమతన్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఏడు జిల్లాల గుండా వెళుతూ ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే ని కలుపుతుందన్నారు. అలాగే ఆర్ధిక వృద్ధికి, ఉద్యోగాల కొరకు ఢిల్లీకి వెళ్లే యువతకు ఈ-వే ఎంతగానో సహాయపడుతుందన్నారు.