విజయశాంతి, వివేక్, కొండా, రాజగోపాల్ రెడ్డికి బీజేపీలో కీలక బాధ్యతలు
అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతోంది. కీలక పదవుల్లో పార్టీ ముఖ్యనేతలను పార్టీ నియమించింది. ఎన్నికల కోసం మొత్తం 14 కమిటీలను ఏర్పాటు చేశారు. బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా వివేక్ ను నియమించారు. ఈ కమిటీలో మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. కమిటీ కన్వీనర్ గా మహేశ్వర్ రెడ్డి వ్యవహరిస్తారు. స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ గా రాజగోపాల్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. పబ్లిక్ మీటింగ్స్ ఛైర్మన్ గా బండి సంజయ్ ఉంటారు. పోరాటాల కమిటీ ఛైర్మన్ గా విజయశాంతి వ్యవహరిస్తారు. కోర్డినేషన్ కమిటీ ఛైర్మన్ గా పార్టీ సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. చార్జ్ షీట్ కమిటీ ఛైర్మన్ గా పార్టీ ముఖ్యనేత మురళీధర్ రావు ఉంటారు. సోషల్ మీడియా కమిటీ ఛైర్మన్‌గా ధర్మపురి అర్వింద్ వ్యవహరిస్తారు. సోషల్ అవుట్ రీచ్ ఛైర్మన్ గా ఎంపీ లక్ష్మణ్ బాధ్యతలు చేపడతారు. పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్‌గా రఘునందన్ రావును నియమించారు. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించితీరాలన్న కసితో భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసే బాధ్యతలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ ఇద్దరు నేతలకు.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని వివరించారు.