Home Page SliderInternational

కొంపముంచిన సంబంధం, భారత సంతతి లాయర్‌ను తొలగించిన అమెరికా కంపెనీ

Share with

ఒకరికి ఒకరు ఇష్టపడితే ఏమైనా చేసుకోవచ్చన్నది రోటీన్ ఫిలాసఫీ. దాన్నే పద్దతని కూడా అంటారు. ఒకర్ని ఒకరం ఇష్టపడ్డాం. ఏమైనా చేసుకోవచ్చని కొందరనుకుంటారు. కానీ కొన్నిసార్లు అది సక్రమం కాకపోవచ్చు. ఆయా సంస్థల విధివిధానాలను దెబ్బతీస్తాయన్న భావనను కంపెనీలు వ్యక్తం చేయొచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ అమెరికాలో జరిగింది. అమెరికాలో ఓ కంపెనీ న్యాయ విభాగంలో పనిచేస్తున్న భారత సంతతి లాయర్, అక్కడ సీఈవోతో సన్నిహితంగా మెలగడం, సంబంధం పెట్టుకోవడంతో.. సదరు కంపెనీ ఇద్దరినీ ఉద్యోగాల్లోంచి పీకేసింది.

కంపెనీ సీఈఓతో వర్క్‌ప్లేస్ సంబంధం ఆరోపణపై భారతీయ సంతతికి చెందిన న్యాయవాది, చీఫ్ లీగల్ ఆఫీసర్ నబానితా నాగ్‌ను ‘నార్ఫోక్ సదరన్ కార్పొరేషన్‌’ తొలగించింది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తన బాస్ అలాన్ షాతో సంబంధానికి పాల్పడ్డారనే ఆరోపణలతో విచారణ తర్వాత ఆమెను తొలగించారు. అదే సమయంలో సీఈవోనూ సంస్థ విధుల నుంచి తప్పించింది. ఇద్దరూ పరస్పరం ఏకాభిప్రాయంతో సంబంధం పెట్టుకున్నప్పటికీ… ఇది కంపెనీ రూల్స్‌కు విరుద్ధమని, విధానాలు, నీతి నియమావళిని ఉల్లంఘించారని, ఇది సహించరాని నేరమని నార్ఫోక్ సదరన్ కార్పొరేషన్ తెలిపింది.

“కంపెనీ చీఫ్ లీగల్ ఆఫీసర్‌తో సంబంధం పెట్టుకొని అలెన్ షా కంపెనీ విధానాలను ఉల్లంఘించారని కంపెనీ దర్యాప్తు నిర్ధారించింది. అలెన్ షా తొలగింపు కంపెనీ పనితీరు, ఫైనాన్షియల్ రిపోర్టింగ్, కార్యకలాపాల ఫలితాలతో సంబంధం లేదని నార్ఫోక్ సదరన్ కార్పొరేషన్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో, నబినితా నాగ్ తనను తాను మూడు ఫార్చ్యూన్ 300 పబ్లిక్ కంపెనీలతో కలిసి పనిచేసే “సీజన్డ్ లీడర్” అని పేర్కొంది. గతంలో గోల్డ్‌మన్ సాక్స్‌లోనూ పనిచేసింది.

2022లో చీఫ్ లీగల్ ఆఫీసర్‌గా, 2023లో కార్పొరేట్ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తోంది. మొదటిసారిగా 2020లో నార్ఫోక్ సదరన్‌లో జనరల్ కౌన్సెల్‌గా చేరి, ఉన్నత స్థాయికి చేరారు. ఆమె జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్లంలో బ్యాచిలర్ డిగ్రీ, న్యూయార్క్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లా నుండి జ్యూరిస్ డాక్టర్ పొందారు. ఇదంతా తెలివి తేటలతో కంటే, సంబంధం ద్వారానే సాధ్యమైందన్న భావన కంపెనీలో పనిచేసే ప్రముఖుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అలెన్ షా తొలగింపు తర్వాత కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మార్క్ R జార్జ్, ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు.