పుతిన్‌నే వెయిట్ చేయించాడు.. టర్కీ అధ్యక్షుడు మామూలోడు కాదు…

టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మామూలోడు కాదని చాన్నాళ్ల నుంచి వింటూనే ఉన్నాం… రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్… టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో సమావేశానికి ముందు వెయిట్ చేయాల్సి రావడం అంతర్జాతీయ మీడియాలో సంచలనంగా మారింది. పుతిన్ ప్చ్ అనుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దాడి తర్వాత.. రష్యా అధ్యక్షుడు పుతిన్… ఇరాన్‌లో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. పుతిన్ తో సమావేశానికి టర్కీ అధ్యక్షుడు లేట్ గా రావడంతో… ఆయన వెయిట్ చేయాల్సి వచ్చింది. సమావేశమందిరంలో పుతిన్ వెయిట్ చేయడం మీడియా సాక్షిగా కన్పించడంతో అందరూ అవాక్కయ్యారు. ఎర్డోగాన్ కోసం పుతిన్ కొద్దిక్షణాలు వేచి ఉండటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
