ప్రముఖ నటుడి ఇంట్లో తీవ్ర విషాదం
టాలీవుడ్ ప్రముఖ నటుడు నాజర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాగా నాజర్ తండ్రి మహబూబ్ బాషా (95) ఇవాళ కన్నుమూశారు.గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తమిళనాడు చెంగల్‌పట్టులోని నివాసంలో తుదిశ్వాస విడిచారు.దీంతో ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ,సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.కాగా తన తండ్రి ప్రోత్సాహంతోనే నాజర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే నాజర్ తెలుగు,తమిళ్,కన్నడ,మలయాల,హిందీ భాషల్లో అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.