Home Page SliderInternationalPolitics

యుద్ధం ఆపాలంటే ఆ ప్రాంతాలు వదులుకోండి..ట్రంప్ సలహా

రష్యా, ఉక్రెయిన్ల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా ప్రయత్నిస్తూనే, ఉక్రెయిన్‌కు మద్దతును తగ్గిస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహా ప్రకారం ఉక్రెయన్‌లోని క్రిమియాపై రష్యా నియంత్రణ కొనసాగడం మంచిదనే భావిస్తున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. రష్య- ఉక్రెయిన్ శాంతి ఒప్పందంలో భాగంగా ఒక ఫ్రేమ్ వర్క్ రూపొందించారు. దీనిని ఉక్రెయిన్, యూరోపియన్ అధికారులు పారిస్‌ల పరిశీలించారు. క్రిమియాపై రష్యా నియంత్రణ కొనసాగడం అవసరమే కాక, రష్యా ఆక్రమించుకున్న మరో నాలుగు ప్రావిన్స్‌లపై కూడా  ఉక్రెయిన్ ఆశలు వదులకోవాల్సిందేనని తేల్చారు.  ఈ ఒప్పందాలకు ఉక్రెయిన్ అంగీకరించని పక్షంలో అమెరికా చర్చల ప్రయత్నాలు మానేస్తుందని హెచ్చరించారు.