Home Page SliderNational

“బాద్ షా”ను చంపేస్తామని బెదిరింపులు

Share with

ఇటీవల కాలంలో దేశంలోని ప్రముఖులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ చర్యలతో ఇప్పటికే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ,అంబానీ కుటుంబానికి మహరాష్ట్ర ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో  మహరాష్ట్ర ప్రభుత్వం షారుఖ్ ఖాన్‌ భద్రతనుY+ క్యాటగిరీకి  అప్ గ్రేడ్ చేసింది. కాగా షారుఖ్ ఖాన్ ఈ ఏడాది పఠాన్,జవాన్ సినిమాలతో బాక్సాఫీసును షేక్ చేసి బ్లాక్ బస్టర్ విజయాలను ఖాతాలో వేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే గుర్తు తెలియని వ్యక్తులు షారుఖ్ ఖాన్‌ని చంపేస్తామంటూ ముంబైలోని ఆయన నివాసానికి బెదిరింపు లేఖలు పంపించినట్లు తెలుస్తోంది. దీంతో మహరాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కాగా మహరాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే షారుఖ్ ఖాన్‌కు ఉన్న భద్రతను పెంచుతూ..Y+ కు మార్చింది. దీంతో ఇకపై షారుఖ్ ఖాన్‌కు 6 మంది సిబ్బంది 3 షిప్టుల్లో 24*7 భద్రత కల్పించనున్నారు.