ఈ ఆస్తి తగాదాను విజయమ్మే తీర్చాలి..బాలినేని
వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డలు ఆస్తుల కోసం తగాదాలు పడడం బాధాకరమని జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో విజయమ్మ కల్పించుకుని వారి మధ్య సయోధ్య కుదర్చాలని కోరారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించకూడదన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా రాజశేఖర రెడ్డి కుటుంబం బాగుండాలని కోరుకుంటానని పేర్కొన్నారు. తాను వైసీపీలో ఉన్నప్పుడు తన ఆస్తులు పోగొట్టుకున్నానని, ఏమీ సంపాదించుకోలేదని పేర్కొన్నారు.

