ఇదేం పని.. రన్నింగ్ బస్సులో ఆటో డ్రైవర్ దాడి..
హైదరాబాద్ లోని మియాపూర్ ఆల్విన్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్ డ్రైవర్‌పై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. తన ట్రాన్స్‌పోర్టు ఆటోకు దారి ఇవ్వలేదంటూ రన్నింగ్‌లో ఉన్న బస్సు ఎక్కి డ్రైవర్‌పై విరుచుకుపడ్డాడు. దీంతో డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. ఆటో డ్రైవర్ బస్సులోకి వచ్చి బస్ డ్రైవర్ ఫోన్‌ను లాక్కొని వెళ్లాడు. రన్నింగ్ బస్ ఎక్కి ఒక వ్యక్తి కిటికీ బయట నుంచి డ్రైవర్ ను బస్ తోలనివ్వకుండా చేయి పట్టుకున్నాడు. బస్సులో ప్రయాణికులు ఉన్నారని కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

