అక్కను చంపిన తమ్ముడు
హన్వాడ: తమ్ముడి చేతిలోనే ఓ మహిళ దారుణంగా హత్యకు గురైన ఘటన. ఎస్సై రవినాయక్ చెప్పిన కథనం ప్రకారం.. హన్వాడ మండలం నాయినోనిపల్లికి చెందిన చెంచు రాములమ్మ (58) బుధవారం రాత్రి ఇంటిముందు నిద్రపోతోంది. పక్క ఇంట్లో ఉండే చెంచు నర్సిములు తాగిన మైకంలో రాత్రి 11.30 గంటల ప్రాంతంలో రోకలిబండతో రాములమ్మ తలపై మోది హతమార్చాడు. తలకు తీవ్ర గాయాలై కేకలు వేసింది. ఇంట్లోని ఆమె కొడుకులు వచ్చి చూసేసరికి హత్యచేసిన వ్యక్తి పారిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న రాములమ్మను ఆటోలో మహబూబ్‌నగర్ గవర్నమెంట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న వ్యక్తిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో నిందితుడు నెల రోజుల నుంచి తాగి గ్రామంలో తిరుగుతున్నాడని చెప్పిన పోలీసులు.