Andhra PradeshHome Page Slider

మోసగాడికి అండగా మంత్రి!

Share with

జనాన్ని వంద కోట్ల రూపాయలతో ముంచిన ఒక మోసగాడికి రాష్ట్ర మంత్రి ఒకరు అండగా నిలవడం కర్నూలులో కలకలం రేపుతోంది. కడపకు చెందిన షేక్ మహ్మద్ గౌస్ కర్నూలులో పాత వాహనాలు కొని, అమ్మే వ్యాపారం చేస్తున్నట్లు నటించి అధిక వడ్డీ ఆశ చూపి పలువురి నుంచి దాదాపు రూ.100 కోట్లు సేకరించి ఉడాయించాడు.

కర్నూలు: జనాన్ని వంద కోట్ల రూపాయలతో ముంచిన ఒక మోసగాడికి రాష్ట్ర మంత్రి ఒకరు అండగా నిలవడం కర్నూలులో కలకలం రేపుతోంది. కడపకు చెందిన షేక్ మహ్మద్ గౌస్ కర్నూలులో పాత వాహనాలు కొని, అమ్మే వ్యాపారం చేస్తున్నట్లు నటించి అధిక వడ్డీ ఆశ చూపి పలువురి నుంచి దాదాపు రూ.100 కోట్లు సేకరించి ఉడాయించాడు. బాధితులు వృథ్వీరాజ్, మరికొందరి ఫిర్యాదు మేరకు ఈ ఏడాది జులై 16న పోలీసు కేసు నమోదైంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ కొందరు బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదైనట్లు తెలిసింది. గౌస్ కోర్టును ఆశ్రయించి ఐపీకి దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు వందమంది బాధితులుండగా 44 మందికి రూ.6.69 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉందని, తనకు 14 ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నాడు. అనంతరం జడ్‌పీటీసీ సభ్యుడు ఒకరి ద్వారా ఒక మంత్రి సోదరుడిని ఆశ్రయించాడు. ఇందుకోసం ఆ జడ్‌పీటీసీ సభ్యుడికి రెండు వాహనాలను కానుకగా ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది. అమాత్యుడి సోదరుడు ఆ మోసగాడికి బళ్లారిలో ఆశ్రయం కల్పించడంతోపాటు భద్రత కల్పించాడని బాధితులు తెలిపారు.