హిమయత్ సాగర్ గేట్లు ఎత్తివేత…ఆందోళనలో నగర వాసులు
హైదరాబాద్‌లో, ఇతర తెలంగాణ జిల్లాలలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా చెరువులు, నదులు నిండుకుండల్లా ప్రవహిస్తున్నాయి. తాజాగా వికారాబాద్‌లో వర్షాల కారణంగా హిమయత్ సాగర్‌కు వరద నీరు పోటెత్తింది. దీనితో ఈ జలాశయంలో 6 గేట్లు ఎత్తివేశారు. దీనితో నగర వాసులు ఆందోళనలకు గురవుతున్నారు. దిగువ ప్రాంతమైన రాజేంద్రనగర్ వద్ద ఓఆర్ ఆర్ సర్వీస్ రోడ్డును మూసివేశారు. వాహనాలు అటువైపు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. వరద ఇలాగే కొనసాగితే మరో రెండు రోజుల్లో మరో రెండు గేట్లు ఎత్తాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ కూడా ప్రమాద స్థాయిని దాటి నీరు చేరడంతో తూముల ద్వారా వదిలేస్తున్నారు. దీనితో లోతట్టు కాలనీల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

