Home Page SliderTelangana

‘కారు గుర్తు మాకే..ఎవరికీ ఇవ్వొద్దు’..బీఆర్‌ఎస్ సుప్రీంలో పిటిషన్

Share with

‘కారు గుర్తు బీఆర్‌ఎస్ పార్టీకి మాత్రమే కేటాయించాలని, వేరే పార్టీలకు కారు గుర్తును, కారును పోలిన గుర్తులను కేటాయించవద్దంటూ’ సుప్రీంకోర్టులో పిటిషన్‌ను వేసింది. అలాగే ఎన్నికల కమీషన్‌కు కూడా లేఖ రాసింది. తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించడంతో పార్టీల ప్రచారాలు జోరందుకున్నాయి. పార్టీ గుర్తుల విషయంలో తేడాలు రాకుండా ముందు జాగ్రత్త పడుతోంది బీఆర్‌ఎస్ పార్టీ. గత ఎన్నికలలో ఇండిపెండెంట్లకు కారును పోలిన గుర్తులు, ట్రాక్టర్‌ను కేటాయించడంతో బీఆర్‌ఎస్ పార్టీకి రావలసిన ఓట్లు కొన్ని చీలిపోయాయని అప్పట్లో ఆరోపణలు చేసింది. పైగా టీఆర్‌ఎస్ పేరు కూడా బీఆర్‌ఎస్‌గా మార్పు చెందినందువల్ల పార్టీ గుర్తు విషయంలో తేడాలు రాకూడదని పిటిషన్ వేయబోతున్నారు గులాబీ పార్టీ.