ఉత్తరాంధ్ర నుంచి బస్సు యాత్ర మొదలు.. షెడ్యూల్ ఇదే..
విజయనగరం: రాజ్యాధికారం అన్నివర్గాలకు అందించాలన్న ధ్యేయంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని, అన్ని ప్రధాన పదవులు వెనుకబడిన వర్గాలకు కేటాయించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అక్టోబర్ 26 నుండి 9 నవంబర్ వరకు ఉత్తరాంధ్రలో బస్సు యాత్ర జరుగుతుందని, ఇచ్ఛాపురం నుండి యాత్ర మొదలవుతుందని ఆయన వివరించారు.
చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. బాబు కుటుంబసభ్యుల సూచనలు కోర్టు పరిగణనలోకి తీసుకుంటే ఆచరిస్తామని మంత్రి అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిచే పార్టీ వైఎస్సార్‌సీపీయే. విశాఖ కేంద్రంగా పాలనను ఉత్తరాంధ్ర ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అని మంత్రి పేర్కొన్నారు.
నిన్నటి సభలో సీఎం జగన్ వాస్తవాలే మాట్లాడారు. వ్యక్తిగత దూషణలు చేయలేదు. లోకేష్ అమిత్ షాను కాదు అమితాబ్‌ను కలిసినా మాకు అభ్యంతరం లేదు. చట్ట ప్రకారం చంద్రబాబుపై చర్యలు తీసుకున్నారు కానీ వ్యక్తిగతం కాదు అని మంత్రి బొత్స స్పష్టం చేశారు.
ఉత్తరాంధ్ర మంత్రుల సామాజిక బస్సు యాత్ర షెడ్యూల్: 26న ఇచ్ఛాపురం, 27-గజపతినగరం, 28-భీమిలి, 30-పాడేరు, 31-ఆముదాలవలస, నవంబర్ 1-పార్వతీపురం, 2-మాడుగుల, 3-నరసన్నపేట, 4-ఎస్.కోట, 6-గాజువాక, 7-రాజాం, 8-సాలూరు, 9-అనకాపల్లి.