గ్రూపు-2 ఫలితాలు విడుదల
గ్రూపు-2 ఫలితాలను టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసింది. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించిన వివరాల ప్రకారం, మొత్తం 783 పోస్టులకు గాను 782 మంది ఎంపిక కాగా, ఒక పోస్టును కోర్టు కేసు కారణంగా పెండింగ్‌లో ఉంచారు. 18 కేటగిరీలలో ఎంపికైన వారి జాబితాను కమిషన్ అధికారిక వెబ్‌సైట్ (https://www.tspsc.gov.in/)లో ఉంచినట్లు తెలిపారు. ఇప్పటికే మూడు దశల్లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయి, సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు ధ్రువపత్రాల పరిశీలన కూడా జరగగా, తుది ప్రక్రియ ముగిసిన అనంతరం గ్రూప్-2 ఉద్యోగాల ఫలితాలను విడుదల చేశారు. ఇక త్వరలోనే గ్రూప్-3 ఫలితాలు వెలువడే అవకాశం ఉందని కమిషన్ తెలిపింది.

