కొండగల్‌లో టెన్షన్…టెన్షన్
లగచర్ల కలెక్టర్ పై దాడి కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం మథ్యాహ్నం వరకు 55 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది.ఇందులో 16 మందిని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. వీరందరిని పరిగి సబ్ జైల్ కి తరలించారు. దాడికి సంబంధించి కీలక సూత్రధారిగా భావిస్తున్న బీఆర్ ఎస్ నేత భోగమోని సురేష్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా కొడంగల్‌లో పూర్తిగా టెన్షన్ వాతావరణం నెలకొంది.దాడి ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందేనని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. సమస్యాత్మక గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా బంద్ చేశారు. కొన్నిగ్రామాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. అయినప్పటికీ బీఆర్ ఎస్ పార్టీ మాత్రం వెనుకంజ వేయకపోగా ఆందోళనకు ఊతం ఇచ్చేలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం