చండీగఢ్‌లో టెన్షన్..సైరన్ మోతలు
భారత్- పాక్‌ల మధ్య డ్రోన్ దాడులు, మిసైల్ దాడులు ఉద్రిక్తతకు చేరుకున్నాయి. గురువారం రాత్రి జమ్మూలో బ్లాక్ అవుట్ చేసిన సంగతి తెలిసిందే. పాక్ ప్రయోగించిన డ్రోన్లను భారత్ సైన్యం విజయవంతంగా తిప్పికొట్టింది. అయితే తాజాగా చంఢీగడ్‌లో టెన్షన్ నెలకొంది. అక్కడి వైమానిక దళం సైరన్ మోగించి హెచ్చరికలు జారీ చేసింది. దాడులు జరిగే అవకాశాలున్నాయని, ఇళ్లలోనే ఉండాలని బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బాల్కనీలలోకి కూడా రావొద్దని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత్ దాడులను తట్టుకోలేని పాక్ సామాజిక మాధ్యమాలలో నకిలీ వార్తలు ప్రచారం చేస్తోంది. గుజరాత్ పోర్టులో దాడులని, జలంధర్‌లో డ్రోన్, క్షిపణి దాడులంటూ పాక్ అనుకూల వర్గాలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి, అసత్య ప్రచారాలు నమ్మవద్దని ప్రభుత్వం ప్రజలను హెచ్చరిస్తోంది. తగు జాగ్రత్తలో ఉండాలని ఏమరపాటుతో ఉండాలని పేర్కొంది.

