Home Page SliderNational

సక్సెస్‌ఫుల్‌గా చైతూ, శోభితాల నిశ్చితార్థం

Share with

గతకొంత కాలంగా అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ ప్రేమించుకుంటున్నారని.. త్వరలోనే ఈ జంట ఒకటి కానుందనే వార్తలు సినీ సర్కిల్స్‌లో చాలాకాలంగా వినిపిస్తూ వచ్చాయి. నేడు ఈ వార్తలను నిజం చేస్తూ పులిస్టాప్ పెట్టిన నాగార్జున, ఈ స్టార్ జంట నిశ్చితార్థం చేసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తన మాజీ భార్య సమంతతో విడాకుల తరువాత చైతూ, శోభితా ధూళిపాళతో ప్రేమలో పడ్డాడు. గురువారం రోజు వీరిద్దరు తమ కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఉదయం 9.42 గంటలకు ఈ జంట నిశ్చితార్థం జరిగిందని అక్కినేని నాగార్జున తాజాగా కన్ఫర్మ్ చేశారు. శోభితాను తమ కుటుంబంలోకి ఆయన సాదరంగా ఆహ్వానించారు. ఈ జంట కలకాలం ప్రేమతో సంతోషంగా కలిసి ఉండాలని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఇక చైతూ-శోభితా నిశ్చితార్థానికి సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా ఆయన షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.